దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌) విజృంభించింది. సార్స్ కూడా ప్రాణాంతకమైనదే అయినప్పటికీ ఈ వైరస్ కు వ్యాక్సిన్ ను కనుగొనలేదు. అప్పట్లో ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరగలేదు. 
 
సార్స్ కూడా కరోనా జాతికి చెందిన వైరస్. అందుకే ప్రస్తుతం కనుగొన్న వైరస్ ను కోవిడ్ 19 అని పిలుస్తున్నారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో 2002 లో తొలిసారి సార్స్ వైరస్ బయటపడింది. 2003, ఫిబ్రవరి నెలలో వియత్నాంలోని హనాయ్‌లో సార్స్ వ్యాపించగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు మార్చి 2003 లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తరువాత పలు దేశాల్లో సార్స్ వైరస్ బయటపడింది. 
 
శాస్త్రవేత్తలు సార్స్, కోవిడ్ వైరస్ లు గబ్బిలాల నుంచి బయటపడ్డాయని చెబుతున్నారు. సార్స్, కోవిడ్ ఆర్.ఎన్.ఏ జన్యువుల మధ్య 80 శాతం పోలికలు ఉన్నాయని... వైరస్ ల పై భాగంలో ఉండే ప్రోటీన్ల మధ్య కూడా తేడాలు లేవని చెబుతున్నారు. సార్స్ ఊపిరితిత్తులపై దాడి చేసి నిమోనియా జబ్బును కలుగజేస్తుంది. కోవిడ్ వైరస్ మాత్రం ఊపిరితిత్తులతోపాటు ఇతర జన్యువులపై దాడి చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
సార్స్ నెమ్మదిగా విస్తరించగా కరోనా వేగంగా విస్తరించింది. సార్స్ సోకిన వారిలో లక్షణాలు వెంటనే కనిపించగా కరోనా సోకిన వారిలో మాత్రం లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తున్నాయి. సార్స్ వైరస్‌ దానంతట అదే కనిపించకుండా అదృశ్యమవడంతో వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఆగిపోయాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభయమయ్యాయి. సార్స్‌ లాగా కరోనా కూడా అంతరించి పోయే అవకాశాలు ఉన్నాయని వైద్యులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: