ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య  ఇప్పటివరకూ మంచి మిత్ర సంబంధం కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇరు  తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన చర్చలు జరుపుతూ  ఎప్పటికప్పుడు కలిసి ముందుకు సాగుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు.. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మధ్య సత్సంబంధాలు అంతగా లేవు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. 

 

 మొన్నటి వరకు సంయమనంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ముందుకు సాగగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తే విధంగా కనిపిస్తుంది పరిస్థితి. ప్రస్తుతం ఇరు  తెలుగు రాష్ట్రాల మధ్య లేని వివాదాన్ని సృష్టించడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా తెలంగాణ ప్రభుత్వం చుక్క నీరు కూడా వృధా పోనీవ్వం  కావాలంటే న్యాయ పోరాటం చేస్తాం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కృష్ణా నది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలిస్తామని  అంటూ జగన్ సర్కార్ చెబుతోంది.

 


 అయితే తమకు అవసరం ఉన్నంత మేరకు తమకు హక్కులు ఎంత మేరకు మాత్రమే వీటిని వినియోగించుకుంటమని.. కానీ మిగతా నీటిని కూడా వాడుకొని ఇతర రాష్ట్రాలను మోసం చేయను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ . మరి దీనిపై కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుంది. ఇలా  నీటికి సంబంధించిన వ్యవహారం ఎంతవరకు వెళుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రెచ్చగొట్టే చర్యలకు ప్రభావితం అవుతారా లేక... ఎప్పటిలాగే మిత్ర భావంతో కొనసాగుతూ ఉంటారా  అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: