దేశంలో కరోనా వైరస్ కేసులు మొదల కేరళాలో నమోదు అయ్యాయి. మొదట విదేశీయుల నుంచి అనుకున్నా.. తర్వాత అతి అందరికీ వ్యాపించి గందరగోలం చేస్తుంది.  అయితే కేరళాలో అప్పటి నుంచి అన్నివిషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ వస్తున్నారు.  ఆ మద్య కేరళాలో ఒక్కసారే కేసులు తగ్గు ముఖం పట్టాయి దాంతో సీఎం సంతోషం వ్యక్తం చేశారు.. కానీ ఇప్పుడు ఒక్కసారే మళ్లీ విజృంభిస్తున్నాయి కేసులు. కాగా.. కేరళలో ఇప్పటివరకూ 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 526. గురువారం నమోదైన 84 కరోనా పాజిటివ్ కేసుల్లో 48 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారని, 31 మంది విదేశాల నుంచి వచ్చిన వారని, మరో ఐదుగురికి ఇతరుల ద్వారా కరోనా సోకినట్లు సీఎం తెలిపారు.

 

ముగ్గురు కరోనా నుంచి కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయినట్లు సీఎం ప్రకటించారు. అయితే ఈ మద్య కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.  బెంగళూరు మినహా మిగతా ప్రాంతాల్లో పెద్దగా కరోనా ప్రభావం లేదు.  దీంతో ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  అయితే, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది.  మే 25 నుంచి విమాన సర్వీసులు మొదలైన సంగతి తెలిసిందే.  జూన్ 1 నుంచి సాధారణ రైళ్లు కూడా నడవబోతున్నాయి. 

 

మరో నాలుగు రోజుల్లో సాధారణ రైళ్లు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇక దేశ వ్యాప్తంగా కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఎవరిని అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.  కొంతకాలం పాటు ఆయా రాష్ట్రాల నుంచి కర్ణాటకకు రావొద్దని స్పష్టం చేసింది.  ఆ రాష్ట్రాల నుంచి విమాన సర్వీసులను, రైళ్లను కూడా, రోడ్డు మార్గాలపై నిషేధం విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: