రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ పడాగలు విప్పడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకూ రాయలసీమలో చాలావరకు ప్రశాంత వాతావరణం నెలకొనగా తాజాగా కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు జిల్లాలో వార్తలు వినపడుతున్నాయి. పూర్తి మ్యాటర్ లోకి వెళ్తే కర్నూలు జిల్లా రాజకీయాలలో భూమా కుటుంబం కీలకమని అందరికీ తెలుసు. ఫ్యాక్షన్ లో ఎంతో చరిత్ర ఉన్న ఈ కుటుంబం రాజకీయంగా క్రమక్రమంగా బలపడుతూ ఫ్యాక్షన్ నీ పక్కన పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు దానికి భిన్నంగా నెలకొన్నాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అఖిల ప్రియ మరియు ఏవీ సుబ్బారెడ్డి ల మధ్య వివాదాలు నువ్వానేనా అన్నట్టుగా ఉన్నాయి.

IHG

ఇటీవల ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అఖిల ప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గా ఉంటే ఎన్ని హత్యలు జరుగుతాయో అని ఆరోపించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ ని నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుండి తొలగించాలని అధిష్టానాన్ని కోరారు. ఇదే సమయంలో భూమా కుటుంబంలో మరొకరికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని ఏవీ సుబ్బారెడ్డి కోరారు. మీ కుటుంబానికి ఎంతో అండగా 30 సంవత్సరాలు సేవలు అందిస్తే నన్నే చంపాలని నువ్వు చూసావు, నువ్వు గాని గెలిస్తే నియోజకవర్గంలో పరిస్థితి దేవుడెరుగు అంటూ అఖిల ప్రియ పై ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

IHG

ఎంత మంది కార్యకర్తలను నాయకులను పొట్టన పెట్టుకుంటావో ఎవరికీ తెలియదు. అందువల్ల నియోజకవర్గ ఇన్చార్జి మారాలని కోరుతున్నట్లు ఏవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డి కామెంట్స్ వెనుక వైసీపీ పార్టీ ఉందని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రాయలసీమ కర్నూలు జిల్లాలో సరికొత్త ఫ్యాక్షన్ దిశగా భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి ల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: