ప్రస్తుతం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో కరోనా  వైరస్ ప్రభావం దారుణంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అని చెప్పవచ్చు. ఏకంగా  ఒక మహారాష్ట్రలోని 70 వేలకు పైచిలుకు  కేసులు నమోదు కావడం ప్రస్తుతం దేశానికి శాపంగా మారుతోంది.ఇక రోజు రోజుకు మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులు పెరిగి పోవడంతో పాటు ఈ మహమ్మారి వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వం అసమర్ధత కారణంగా కరోనా  వైరస్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతుందని ఎన్నో విమర్శలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అత్యధిక కేసులతో కరోనా కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలో మరోసారి సంపూర్ణంగా లాక్ డౌన్  అమలు చేయబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాయి.. 

 

 ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా మీడియాలో వస్తున్నట్లుగా మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్  విధించాలి అనే దానిపై ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు మహా రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దు అంటూ సూచించారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే  ఊహాజనితంగా వార్తలు రాసి ప్రజల్లో గందరగోళం సృష్టించ వద్దు అంటూ మీడియాకు హితవు పలికారు మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే. 

 


 కేవలం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ మినహాయింపులు కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు, కేవలం కార్యకలాపాల పున ప్రారంభానికి మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఇచ్చారు కానీ ప్రజలు మాత్రం కరోనా  వైరస్ పట్ల  అంతకు ముందు పాటించినట్లుగానే  నిబంధనలు పాటించాలని కోరారు. అయితే మే 31న కేంద్ర ప్రభుత్వం అన్లాక్ నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: