బెంగాల్ సీపీఐ(ఎం) సీనియర్ నేత , పశ్చిమ బెంగాల్ మాజీ రవాణా శాఖ మంత్రి శ్యామల్ చక్రవర్తి కొన్ని గంటల క్రితమే మృత్యువాతపడ్డారు. ఆయన గత కొన్ని వారాలుగా కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. కోలకతా ఆస్పత్రిలో కరోనా కి చికిత్స పొందుతున్న చక్రవర్తి ఈరోజు మధ్యాహ్నం తన తుది శ్వాస విడిచారు. శ్యామల్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్‌లో సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు.



శ్యామల్ చక్రవర్తి మరణాంతరం బెంగాల్ సిపిఐ (ఎం) సంతాపం ప్రకటించింది.  'కామ్రేడ్ శ్యామల్ చక్రవర్తి మరణం పట్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఆయన అనుభవజ్ఞుడైన ట్రేడ్ యూనియన్ నాయకుడు, మాజీ మంత్రి & సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు. ఈ రోజు దేశంలో కార్మికవర్గం, వామపక్ష ఉద్యమాన్ని ముందుకు నడిపే ఒక గొంతు మూగబోయింది. మేము అతని జెండాలను అతని జ్ఞాపకార్థం ఉంచుతాము', అని బెంగాల్ సిపిఐ పార్టీ నేతలు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.



నిన్న సాయంత్రం వరకు తన తండ్రి శ్యామల్ చక్రవర్తి యొక్క ఆరోగ్యం నిలకడగానే ఉందని అతని కూతురు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ అతను ఈరోజున కరోనాకు తలవంచి అనంత లోకాల్లో కలిసిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా రాజకీయ నేతలకు కరోనా వైరస్ సోకుతుంది. నాలుగు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామంత్రి అయిన కమలారాణి వరుణ్ కరోనా వైరస్ బారినపడి చనిపోయారు. కరోనా సమయంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెకు దురదృష్టవశాత్తూ వైరస్ సంక్రమించింది. అలాగే ఆమెకు ఇతర వ్యాధులు కూడా ఉండటంతో ఆరోగ్యం బాగా క్షీణించి తుది శ్వాస విడిచారు. 5 రోజుల క్రితం కరోనాతో ఎపి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు(60) కన్నుమూశారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: