ఆంధ్రప్రదేశ్ లో జేసి బ్రదర్స్ విషయంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా జేసి ప్రభాకర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. ఈ రాష్ట్రంలో అక్రమ పాలన జరుగుతుంది కాబట్టి పడుకున్న వాళ్లను తీసుకు వెళ్లి లోపల వేశారని ఆయన మండిపడ్డారు. కర్ణాటక లో ఎందుకు లోకాయుక్త లో వేశారు అని ఆయన ప్రశ్నించారు.  ఈ రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి మరో రాష్ట్రానికి న్యాయం తేడా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా కేసు వేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని అన్నారు. ఏమి చేయకపోయినా కేసులు పెట్టి లోపల వేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయని ఆయన అన్నారు. 28 శాతం జీ ఎస్ టి పే చేసి వాహనాలు కొనుగోలు చేసాం అని ఆయన పేర్కొన్నారు. స్పెషల్ స్టేటస్ వున్న రాష్ట్రల్లో పన్ను మినహాయింపు వుంటుంది అని చెప్పారు. అందుకే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేస్తున్నాం అని ఆయన తెలిపారు.

నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అందుకే కొనుగోలు చేస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. తెల్లవారుజమున ఇంట్లో ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మీకో లా.. మాకో లా ఉంటుందా...?  అని ప్రశ్నించారు. ప్రెస్ కాన్ఫెరెన్సు పెట్టినందుకు అరెస్టు చేస్తారేమో అని ఆయన అసహనం వ్యక్తం చేసారు. అశోక్ లేయలాండ్ వాళ్ళను ఎందుకు విచారించడం లేదు నా పేరుతో వాహనాలు లేవని... నాపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. ప్రొఫెషనల్ ట్రాన్స్పోర్టర్స్... మాపై అనవసరంగా కేసులు పెడుతున్నారన్నారు. ఇక్కడ బతకనీయకపోతే మరోచోటకు వెళ్లాడమే అని ఆయన అన్నారు. మీది జరుగుతుంది కాబట్టే ఇక్కడ ఇలా చేస్తున్నారు... కర్ణాటక లో అలా జరగదు.. అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: