రాష్ట్రం విడిపోయాక ఏపీకి రాజధాని లేని విషయం తెలిసిందే. తెలంగాణకు హైదరాబాద్ వెళ్లిపోవడంతో, ఏపీకి రాజధాని లేకుండా పోయింది. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అనుభవం ఉంది, రాజధాని కడతారని చెప్పి ఏపీ ప్రజలు గెలిపించారు. ఇక చంద్రబాబు గెలిచాక కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే 29 గ్రామాల్లో 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు. రైతులకు అందులో కొంతభూమిని అభివృద్ధి చేసి ఇస్తానని చెప్పారు.

అయితే రాజధాని అమరావతికి ప్రధాని మోదీ వచ్చి శంఖుస్థాపన  చేశారు. 2015 అక్టోబర్ 22న మోదీ శంఖుస్తాపన చేశారు. ఇక ఇది అయ్యాక బాబు అధికారంలో ఉన్న నాలుగేళ్ళు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు. తాత్కాలిక భవనాలని చెప్పి, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులని కట్టారు. ఇక అమరావతిలో జరిగిన అక్రమాల గురించి చెప్పాల్సిన పనిలేదు.

అందుకే ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబుని చిత్తుగా ఓడించి జగన్‌ని గెలిపించారు. ఇక జగన్ ఏమో అమరావతి వల్ల అభివృద్ధి జరగదని చెప్పి, మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుని జ్యూడిషయల్ క్యాపిటల్‌గా చేయడానికి ఫిక్స్ అయ్యారు. కానీ ఈ నిర్ణయాన్ని అమరావతి రైతులు, టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ఇక తాజాగా అమరావతికి శంఖుస్థాపన చేసి ఐదేళ్లు అయిన సందర్భంగా చంద్రబాబు, ఆదాయాన్ని ఇచ్చే అమరావతిని చంపేసి, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసే మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు.

ఇక దీనికి కౌంటర్‌గా వైసీపీ విజయసాయి... బాబు అనుభవం అంతా రాష్ట్రాభివృద్ధిలో కాకుండా గ్రాఫిక్స్‌లో చూపెట్టి... రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి, రాష్ట్ర ప్రయోజనాలన్ని తొక్కిపెట్టి, సొంత ప్రయోజనాలను ముందు పెట్టి... రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటే నీరూ, మట్టి.... అందుకే జనాలు నిన్ను కూర్చోబెట్టారు ఓడగొట్టి" అంటూ విజయసాయి ఓ సెటైర్ వేశారు. ఇక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి విజయసాయి చెప్పిన లాజిక్ కరెక్టే అని, బాబు ఆ విషయం తెలుసుకోకుండా ఇంకా ప్రజలేదో అమరావతిని కోరుకుంటున్నారంటూ మాట్లాడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: