సాధారణంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ముందు ఆ పార్టీని టార్గెట్ చేసి ఎక్కువగా విమర్శలు చేయాల్సి ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ నేతలకు దీటుగా మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఈ విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సరే వారికి ఆశించిన స్థాయిలో మద్దతు రావటం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న సరే ఇతర బీజేపీ నేతలు ఎవరూ కూడా ఎదురు దాడి చేయడం లేదు. టిఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా పది మంది నేతలు వరకు ఇప్పుడు బండి సంజయ్ ని టార్గెట్ చేసిన విమర్శలు చేస్తున్నా సరే రాష్ట్ర పార్టీలో ఉన్న ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో టిఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా విమర్శలు చేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ ఆత్మరక్షణలో పడిపోయారు. ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత కాస్త బండి సంజయ్ కు అండ దొరికినట్లయింది.

ధర్మపురి అరవింద్ వచ్చే వరకు కూడా ఆయనకు అండగా ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు ఈ పరిణామాలపై బీజేపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఒక పక్కన బలపడాలని చూస్తున్న సరే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని బీజేపీ అధిష్టానం కొంతమంది సీనియర్ నేతలకు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కూడా బీజేపీ అధిష్టానం కొన్ని వివరాలు అడిగినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తూ ఏం మాట్లాడకుండా ఉంటున్నారో వారందరినీ కూడా ఇప్పుడు జాబితా రూపంలో సిద్ధం చేసి బిజెపి అధిష్టానానికి ఇవ్వాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: