రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు జరిగి  ఏకంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే రోడ్డు నిబంధనలు పాటించి  ప్రాణాలు కాపాడుకోవాలి అని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తూనే ఉంటారు. అయితే ప్రజలకు  ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టి సూచనలు సలహాలు ఇచ్చినప్పటికీ వాహనదారులు మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే.. కనీసం  వాహనాన్ని ఆపి ఫోన్ మాట్లాడేందుకు సమయం లేనట్టుగా... కనీసం రోడ్డు పక్కన బైక్ ఆపి నీళ్లు తాగడానికి సమయం లేనట్లుగా వ్యవహరిస్తూ.. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎన్నో రోడ్డు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నిబంధనలు పాటించి  ప్రాణాలు కాపాడు కోవాలి అని ఎన్నిసార్లు సూచించినప్పటికీ వాహనదారులలో  రోజురోజుకు నిర్లక్ష్యం పెరిగి పోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. కనీసం ద్విచక్రవాహనంపై వెళ్లేవారు హెల్మెట్ కూడా పెట్టుకోరు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు అని తెలిసింది అంటే చాలు వాళ్ల చేతికి చిక్కకుండా షార్ట్ కట్ రూట్ లో తప్పించుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ పోలీసులు చెప్పేది మన ప్రాణాలు కాపాడుకోవడానికి కదా అన్న విషయాన్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ఈ క్రమంలోనే ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఎంతో వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ఫోటో ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇటీవలే హైదరాబాద్లో ఓ వ్యక్తి బైక్ నడుపుతూ వాటర్ బాటిల్ తో నీళ్లు తాగుతున్న ఫోటో ని క్లిక్ మనిపించారూ  ట్రాఫిక్ పోలీసులు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అంతేకాదండోయ్ ఈ ఫోటోకి ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. బాబ్జి బాబు గారు బాగా బిజీ.. నీళ్ళు తాగడానికి కూడా బైక్ ఆపలేనంత   బిజీ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు భారీ జరిమానా కూడా విధించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: