బాహుబలి సినిమా లో రాజు ని ఎవరిని చేయాలి అన్న అయోమయం నెలకొన్నప్పుడు కాలకేయ తో యుద్ధం లో ఎవరు గెలిస్తే వారికే రాజు అయ్యే ఛాన్స్ అని శివగామి చెప్పింది. ఇప్పుడు అలాంటి పరిస్థితీ తెలంగాణ లో నెలకొంది.. కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి అయ్యే ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటికి కొంత అయోమయం అయితే ఉంది.. కేసీఆర్ కొడుకు కేటీఆర్ , అల్లుడు హరీష్ రావు లలో పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికీ ఉంది అంటే ఎవరు చెప్పలేరు.. ఎందుకంటే ఎవరి బలాలు వారికి ఉన్నాయి.. అయితే కేసీఆర్ కొడుకు అయిన కేటీఆర్ కే ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు..

అయితే ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల హడావుడి మాములుగా లేదు.. దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయం ఎంతో వేడి గా ఉందని చెప్పొచ్చు.. ప్రతిపక్షాలు గెలవడానికి ఇప్పటికే అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.. . అధికార పార్టీ కి ఈ ఎన్నికల పై పెద్దగా టెన్షన్ లేకపోయినా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య భీక పోరు జరగనున్నదన్నది వాస్తవం..

గ్రేటర్ ఎన్నికల బాధ్యత ను కేటీఆర్ కి అప్పగించిన కేసీఆర్ దుబ్బాక ను హరీష్ రావు కు అప్పగించింది.. ఇద్దరిలో ఎవరైతే పార్టీ ని గెలుపు గుర్రం ఎక్కిస్తారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట..అయితే ఎన్నికల భారాన్ని పూర్తి గా వారిమీదే వదిలేయకుండా ఆ ఎన్నికల్లో గెలవడానికి  వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతీ సారి చట్టాలు మార్చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి కూడా ఇదే పని చేస్తున్నాడట.. గతంలో పంచాయతీ ఎన్నికలప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు మున్సిపల్ చట్టాన్ని మార్చారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమూ చట్టాల్ని మార్చాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: