తెలంగాణలో జరగబోతున్న  దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏదో రకంగా ఇక్కడ పైచేయి సాధించి ,విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగే లేదు. అని నిరూపించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక్కడ గెలుపు తమ ఖాతాలో వేసుకుని ,ప్రతిపక్షాలకు తెలంగాణలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ దే విజయం అనే విషయాన్ని గుర్తు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అనేక  వ్యూహాలకు పదును పెట్టారు. అయితే కాంగ్రెస్ నుంచి పెద్దగా భయం లేకపోయినా, బిజెపి మాత్రం కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణ లో ఇప్పుడు హడావుడి చేస్తూ , ఇక్కడ గెలుపు తమదేనని ధీమాలో ఉన్నాయి. 


..ఇక్కడ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గత ఎన్నికల్లో ఓటమి పాలవడం, అప్పటి నుంచి ప్రజల్ని అంటిపెట్టుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుండడం,  ఇలాంటి వ్యవహారాలు ఆయనకు అసహనం కలిగిస్తూనే  వస్తున్నాయి. కొద్ది రోజులుగా బిజెపి హడావుడి చేస్తూనే ఉంది. దీనికి తోడు ప్రైవేట్ సర్వేల్లో బిజెపి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందనే రిపోర్ట్ టిఆర్ఎస్ కు ఉండడం వంటి వ్యవహారాలతో బీజేపీ అంటే కాస్త భయపడుతున్నట్లు అధికార పార్టీ కనిపిస్తోంది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా టిఆర్ఎస్ కు అన్నిచోట్ల అసమ్మతి  పెరిగిపోయింది.


 ఈ అసమ్మతి ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది అధికార పార్టీకి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోందని , అయితే ఇప్పటికే ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులో తెచ్చే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు.  టిఆర్ఎస్ కు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమి కనిపించడం లేదు. పైన తెలంగాణలో బిజెపి  రానున్న రోజుల్లో బలం పెంచుకుంటే తమకు ఇబ్బందిగా మారుతుంది అనే భయం టిఆర్ఎస్ అగ్ర నేతల్లో ఎక్కువగా ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: