టీపీసీసీ రేసు లో ఇద్దరు నేతలు

జీహెచ్ఎంసీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న రాజీనామా చేశాడు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లను గెలుచుకొని గల్లీ స్థాయికి పడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈక్రమంలోనే టీపీసీసీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ప్రస్తుతం ఖాళీ అయింది. గత కొద్దిరోజులుగా టీపీసీసీ రేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. రేవంత్ తోపాటు కాంగ్రెస్ లోని సీనియర్ నేతలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మల్లు భట్టివిక్రమార్క.. జానారెడ్డి.. జగ్గారెడ్డి.. శ్రీధర్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ను.. బీజేపీని ధీటుగా ఎదుర్కొనే శక్తి రేవంత్ రెడ్డికే ఉందని భావించడంతో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీనే మకాం వేశాడు. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా టీపీసీసీ ప్రకటన వస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం తెలంగాణలో మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ ప్రకటన రేపే చేయనుందని సమాచారం. టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డితోపాటు కోమటిరెడ్డి రెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. రేవంత్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డికి మద్దతు ఇస్తున్నారు.

గతంలో తెలంగాణ కోసం తాను మంత్రి పదవీ చేశానని కోమటిరెడ్డి చెబుతున్నారు. తనకే టీపీసీసీ పదవీ దక్కుతుందని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవంత్ వైపే అధిష్టానం మొగ్గుచూపుతుందని సమాచారం. దీంతో ఎవరికీ టీపీసీసీ దక్కుతుందనే ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: