గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలో వైసిపి, టిడిపి నేతల పోటాపోటీ నినాదాలు చేస్తుండడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ హడావుడిలోనే ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్న దేవినేని ఉమ, మంత్రి కొడాలి నాని సవాల్ కు సిద్దం అంటూ ప్రకటించారు. అయితే అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు దేవినేని ఉమను అరెస్టు చేసి బలవంతంగా తీసుకెళ్ళారు. జగన్ డౌన్ డౌన్ అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేయగా దేవినేని ఉమ‌ డౌన్ డౌన్ అంటూ‌వైసిపి కార్యకర్తల నినాదాలు చేశారు. 

ఇక ఈ అంశం మీద ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బూతుల మంత్రిని రాష్ట్రంపై ఊరి మీద ఆంబోతులా జగన్ రెడ్డి వదిలేశారని విమర్శించారు. దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు ఆదీనంలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని వాగుడు రోగం చివరి దశకు చేరింది. ఇష్టాను సారంగా ఎవరినిపడితే వాళ్లను మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన విమర్శించారు. 

శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమామహేశ్వరరావును పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారు.? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తిష్ట వేశాయన్న ఆయన వాటిని పరిష్కరించడం చేతకావడం లేదని అన్నారు. ప్రజలు తంతారనే భయంతో రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన అన్నారు. జనం ముందుకు నాని వస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారని ఆయన అన్నారు. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గుడివాడ ప్రజల సమస్యలు పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: