బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న విమర్శల దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ నేతలు పైకి కనబడక పోయినా సరే లోపల చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో బండి సంజయ్ కాస్త స్పీడ్ గా నే ముందుకు వెళ్తున్నారు. అయితే బండి సంజయ్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. వాస్తవానికి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనను విమర్శించాల్సిన అవసరం ఉంది.

అలాగే రాష్ట్రానికి అలాగే కరీంనగర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అనే విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండిని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేయాల్సి ఉన్నా సరే టిఆర్ఎస్ పార్టీ నేతల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే విషయం చెప్పవచ్చు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి బండి సంజయ్ కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా సరే సీఎం కేసీఆర్ నుంచి పదవులు తీసుకున్న చాలా మంది నేతలు మాట్లాడకపోవటంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

మంత్రి పదవుల్లో ఉన్నవారు కూడా బండి సంజయ్  ని విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కాక టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా తల పట్టుకుంటోంది. ఎవరైతే నేతలు విమర్శించలేదో వారి మీద కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ కూడా అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: