తిరుపతి వెంకటేశ్వరుడు అంటే ఆంధ్రులకు ఎంత భక్తో చెప్పలేం.. ఒక్క ఆంధ్రులు అని ఏముంది.. దక్షిణాదిలో తిరుపతి వెంకన్నను మించిన దేవుడు కనిపించడు.. ఇండియాలోనే అత్యధిక ఆదాయం ఉన్న దేవుడుగా వెంకన్న ఎప్పుడో ఖ్యాతిగాంచాడు. అలాంటి వెంకన్నకు వచ్చే కానుకలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో శ్రీవారికి వచ్చే విరాళాల విషయంలో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంది.

శ్రీవారికి విరాళంగా ఇచ్చిన భూముల నిర్వహణ కష్టంగా ఉందన్న సాకుతో వాటిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో రచ్చ రచ్చ అయ్యింది. జనంలో వచ్చిన వ్యతిరేకత చూసో..లేక.. నిజంగానే స్వామి ఆస్తులను కాపాడాలనుకున్నారో ఏమో కానీ.. టీటీడీ మొత్తానికి ఆ ఆస్తుల వేలం నిర్ణయం వాయిదా వేసుకుంది. అయితే ఇప్పుడు శ్రీవారికి విరాళంగా వచ్చిన భూముల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

అదేంటంటే.. శ్రీవారికి భక్తులు సమర్పించిన స్థలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని కమిటి నిర్ణయించింది. శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్థులు వినియోగం పై సమావేశమైన ఇఓ జవహర్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి భక్తులు సమర్పించిన స్థలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని డిసైడ్ చేసింది. భూములు ఉపయోగకరంగా లేని చోట చిన్న స్థలాలో గోశాల, గీతా మందిరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇలా చేయడం ద్వారా విరాళాలు సమర్పించిన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని టీటీడీ భావిస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా  వుండేలా స్థలాలో కార్యక్రమాల నిర్వహించనున్నారు. అలాగే స్థలాల లీజు విధానం పై కూడా నూతన విధానాన్ని తీసుకురావాలని ఈఓ జవహర్ రెడ్డి భావిస్తున్నారు. మొత్తానికి తిరుపతి వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని టీటీడీ నిర్ణయించడం సంతోషించదగిన విషయమే. అలాగే తిరుమల, తిరుపతి పరిశుభ్రత విషయంలోనూ మరింత శ్రద్ధ పెట్టాలని భక్తులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: