ఆంధ్రప్రదేశ్ లో బిజెపి నేతలు చేస్తున్న తప్పులు కారణంగా ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది నేతలు అసలు పార్టీని పట్టించుకోవడం మానేశారు అనే ఆవేదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నాశనం అయిపోయిన సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలోనే భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆయన త్వరలోనే పార్టీ మారడానికి సిద్ధమయ్యారని తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ గా ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు చర్చలు జరిపారని త్వరలోనే ఆయన పార్టీ మారవచ్చు అని అంటున్నారు.

ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు బిజెపిని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉండటం ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా విశాఖ జిల్లాలో ఆయనకు మంచి  పేరు ఉండటంతో ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు చాలా అనుకూలంగా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఆయన ఎప్పుడు పార్టీ మారుతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కీలక నేతల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: