మున్సిపల్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగా పరిస్థితి కనపడక పోవటంతో ఆ పార్టీ అధినేత జాగ్రత్తగా ముందుకు అడుగులు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు విషయంలో చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారు.

కొంతమంది ఎమ్మెల్యేలు పని చేయాల్సి ఉన్నా సరే పెద్దగా పని చేయడం లేదు. ఇక విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పెద్దగా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్ కు మద్దతు పలికారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ప్రజల్లోకి రావడం లేదని వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా  ఉన్నాయి. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు నాయుడు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

గంటా శ్రీనివాసరావు ఇటీవలి కాలంలో పెద్దగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయలేదు. దీంతో కార్యకర్తలకు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ వెంట నడవడానికి మరో కారణం కూడా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ద్వారా వైసీపీకి సహాయ సహకారాలు అందిస్తున్నారని... తెలుగుదేశం పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం లో బలంగా ఉండటంతోనే ఆయన కాస్త తెలుగుదేశం పార్టీ ద్వారా ఎక్స్ అఫిషియో ఓటు వేయడం... అలాగే కార్పొరేటర్ లను గెలిపించి వైసీపీకి అందించే కార్యక్రమాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: