మన దేశంలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం అనేది కాస్త కష్టమే అయినా సరే ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న సంగతి అర్థమవుతుంది. అయితే రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు చాలామంది ఆయన కూడా సహకరించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్లిన నేపథ్యంలో ఆయన కొంత మంది మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునే విధంగా రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న తెలంగాణ జన సమితి తో పాటుగా మరికొన్ని పార్టీల మీద కూడా దృష్టి పెట్టారు. తమిళనాడులో డీఎంకేకి దగ్గరగానే ఉన్నారు.

అలాగే కర్ణాటకలో కూడా జెడిఎస్ తో ఎక్కువగా స్నేహం చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే రాహుల్ గాంధీ మమతా బెనర్జీని దగ్గర చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. వాస్తవానికి యూపిఏ గవర్నమెంట్ రైల్వే శాఖ మంత్రిగా మమత పని చేశారు. అలాగే బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్  యాదవ్ తో కూడా రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. తాను పార్టీ అధ్యక్షుడు అయితే పార్టీ సీనియర్ నేతల కంటే కూడా మిత్రపక్షాల నుంచి ఎక్కువగా ఇబ్బంది గా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో వాళ్ళ అందరి అభిప్రాయాలు తీసుకుని రాహుల్ ముందుకు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: