తెలంగాణలో విజయశాంతి పార్టీ మారిన తర్వాత భారతీయ జనతా పార్టీకి పెద్దగా ప్రయోజనం కలిగింది ఏమీ లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయశాంతి పార్టీ మారిన తర్వాత కొన్ని కొన్ని అంశాల్లో భారతీయ జనతాపార్టీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాలు ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది మెదక్ జిల్లా నేతలు కూడా ఆమెను నమ్ముకొని పార్టీ మారే అవకాశం ఉందని అందరూ భావించారు.

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కూడా కొంతమంది కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపించాయి. అయితే  ఇప్పుడు విజయశాంతి వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఏమీ లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమెను బిజెపి కూడా పక్కన పెట్టింది అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆమెతో సన్నిహితంగా ఉండే కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే భావం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి విజయశాంతి వలన ఎటువంటి ఉపయోగం లేకపోతే ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి విజయశాంతి ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటి అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలతో ఆమె ఇప్పుడు చర్చలు జరుపుతున్నారని భారతీయ జనతా పార్టీలోకి వస్తే కచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారని కొంతమంది అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: