కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవలసిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు ఎక్కువగా చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని రాహుల్ గాంధీ బలోపేతం చేయలేక పోతున్నారు అనే ఆవేదన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఆర్థికంగా బలంగా ఉన్న నేతలతోపాటు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని కూడా ముందుకు తీసుకువచ్చి... ముఖ్యమంత్రులను కూడా చేసింది.

కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బలంగా ఉన్న నేతల మీద మాత్రమే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. దీని కారణంగా కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలు మీద భారతీయ జనతా పార్టీ బలంగా దృష్టి పెట్టడంతో రాహుల్ గాంధీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది యువ నేతల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది.

వాళ్లకు ఏకంగా ముఖ్యమంత్రి పదవులను కూడా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీకి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ముఖ్యమంత్రి సీటు ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. మీతో పాటు కొంతమంది నేతలు కూడా వస్తే వాళ్లకు కూడా మంత్రి పదవులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వెళ్లిందని టాక్. అలాగే మధ్యప్రదేశ్ లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా ఇప్పుడు బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. అంతే కాకుండా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చర్చలు ఎక్కువగానే జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కలవరం మొదలైంది. మరి దీని బిజెపి అధిష్టానం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: