నిర్బంద ఏకగ్రీవాలు నేను ఇప్పుడే చూస్తున్న అని సిపిఐ నారాయణ  ఆరోపించారు. ఇంత అధికార దుర్వినియోగం నేను  ఎప్పుడూ చూడలేదు అని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే వైకాపా ఎన్నికలలో పోటీ చేసి గెలవాలి అని ఆయన సవాల్ చేసారు. నీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు వల్ల ఓట్లు రావని భయమా ...? అని నిలదీశారు. ప్రజలు సొమ్ము జగన్ అబ్బ సొత్తు లాగా ఖర్చు చేస్తున్నాడు అని మండిపడ్డారు. ఏపిలో ప్రజా స్వామ్యం లేదు అని ఆయన ఆరోపించారు. 2 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ను 5 వేల కోట్లు కు అధాని కు అమ్మేస్తున్నారు అన్నారు.

స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూస్తున్న పెద్ద మనిషి వైజాగ్ లో పాదయాత్ర చేస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. వైకాపా శ్రేణులంతా వైజాగ్ లో పెద్ద మనిషి పాదపూజ చేస్తున్నారు అని మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగా  అమరావతి తరలిస్తున్నారు అని ఆరోపించారు. 8 వార్డు లో సిపిఐ అభ్యర్థి జంగాల రమాదేవి ఎన్నికల ప్రచారం లో సిపిఐ నేతలు నారాయణ, ముప్పాళ్ళ, జంగాల , టిడిపి మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర, తూర్పు టిడిపి ఇన్ చార్జ్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేసారు.

గుంటూరు టిడిపి మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ... 22 నెలల గా జరుగుతున్న అరాచక పాలన సాగుతుంది అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో  చరమగీతం పాడాలి అని కోరారు. మున్సిపాలిటీ లో ఆస్తి పన్ను పేరుతో ప్రజలపై పెద్ద భారం మోపనున్నారు అని ఆయన ఆరోపించారు. నిత్యవసర వస్తువులు కొనలేని పరిస్దితి ఉందన్నారు. ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశానికి అంటించారు అని మండిపడ్డారు. 151 సీట్లు ఇచ్చారు కాబట్టి మా  రాజ్యాంగమే నడవాలనే దోరణీ లో ఉన్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గుంటూరు నగరం అంతర్జాతీయ స్థాయి లో అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆచుచూసి ఓటు వేయాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: