ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటనే దానిపై స్పష్టత రాకపోయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం బిజెపి  అధిష్టానం సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశముంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏ విధంగా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా పని చేయలేకపోయారు. కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత సోము వీర్రాజు కి బాధ్యతలను అప్పగించారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీని ధీటు గానే ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు.

కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు. దీనివలన బిజెపి  అధిష్టానం నేతలు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు కూడా సోము వీర్రాజు కు అర్థం కావడం లేదు. ఇక మీడియా సమావేశంలో కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. ఆయన వ్యాఖ్యలకు మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు సోము వీర్రాజును తప్పించి మళ్ళీ కన్నా లక్ష్మీ నారాయణకు బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కన్నా లక్ష్మీ నారాయణ బాధ్యతలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సన్నిహితంగా ఉన్న తన స్నేహితులు, మాజీ మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారని అన్నారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణను మరో పార్టీలో కి వెళ్ళకుండా అడ్డుకోవడానికి బిజెపి  అధిష్టానం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాబోయే వారం పది రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: