బంగారం.. ఈ పదం వింటూనే మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఇక భర్తలు బంగారం కొంటామంటే మహిళలు ఎగిరి గంతేస్తారు. మన ఇండియాలో బంగారానికి అంత ప్రాధాన్యత ఉంది.  భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏ శుభకార్యమైనా బంగారం లేకుండా జరగదు. పెళ్లిళ్లకు, పండుగలకు బంగారాన్ని పెద్దఎత్తున ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఇది ఎప్పుడూ రేటు పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఓ పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తారు.

అయితే ఓ వారం రోజుల నుంచి బంగారం రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇన్నాళ్లూ ఆకాశాన్నంటిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. ముఖ్యంగా గతవారం రోజులుగా బులియన్ మార్కెట్లలో తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి రేట్లు ధరలు తాజాగా మరింత క్షీణించాయి. ఆల్-టైమ్ హై నుండి రూ.12వేల మేర పతనం అయ్యాయి. నిజంగా బంగారం కొనుగోలు చేయాలని వారికి ఇదే మంచి సమయం అంటున్నారు విశ్లేషకులు. బంగారం తరహాలోనే వెండి ధరకూడా భారీ పతనాన్ని నమోదు చేసింది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన రేట్ల ప్రకారం స్పాట్‌ మార్కెట్‌లో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 44,422గా ఉంది. వెండి కిలో ఏకంగా 1360 రూపాయలు తగ్గి రూ. 64,766 స్థాయికి చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,450 ఉంది.  24 క్యారెట్ల బంగారం ధర రూ.45,220కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,810 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,610గా ఉంది.

బంగారం రేటు క్యారెట్లను మారుతున్న సంగతి తెలిసిందే. బంగారం గురించి తెలిసిన వారికి 22 క్యారెట్లు, 24 క్యారెట్లు అనే పదాలు తెలిసే ఉంటాయి. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. బంగారం ఎంతో సున్నితమైంది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడానికి సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మొతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: