ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు అన్న విషయం తెలిసిందే..  అయితే ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ వస్తువుల పైన ఎక్కువగా ఆధారపడుతూ  ఉన్నారు.  ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాలు కూడా కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవి  కావడం అదే సమయంలో...  ఖాళీగా ఉన్న సమయంలో టైం పాస్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ మొబైల్స్ చూస్తూ ఉండటం లాంటివి చేస్తున్నారు.  ఇలా ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం భారీగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరగడం ఏమో కానీ..  ఇక ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఎక్కువ కావడం వల్ల ఏకంగా ఎంతో మంది కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఉరుకుల పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే పౌష్టికాహార లోపం కారణంగా కొంతమంది కంటిచూపు సమస్యలతో బాధపడుతూ ఉంటే మరి కొంతమంది ఎలక్ట్రానిక్ డివైస్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇక ఆ వస్తువుల నుంచి వచ్చిన లైటింగ్ కారణంగా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారు మరికొంతమంది.  ఇలా రోజురోజుకుకంటి చూపు మందగించి చివరికి అద్దాలు ధరిస్తే కానీ సరిగ్గా చూడలేని వారు ఎంతో మంది.  ఇలా నేటి రోజుల్లో కంటి చూపు సమస్య అనేది సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినాసైట్ కోసం కళ్లద్దాలు ధరించి ఉంటున్నారు.



 అయితే దృష్టి లోపం ఉన్న వారి గురించి ఇటీవల ఓ సర్వేలో ఆసక్తికర నిజం బయటపడింది. ఎలాంటి కంటి సమస్యలు లేని వారితో పోల్చి చూస్తే.. కొద్దిపాటి కంటి చూపు సమస్య ఉన్న వారికి మరణ ముప్పు 29 శాతం అధికంగా ఉంటుంది అంటూ ద లన్సెట్  గ్లోబల్ హెల్త్ చెప్పుకొచ్చింది. ఆంధ్రులు.. తీవ్ర నేత్ర సమస్యలు ఉన్నవారికి ఈ ముప్పు ఏకంగా 29 శాతం గా ఉంటుంది అని ఈ సర్వేలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానంతో ఐదింటిలో 4 కంటి సమస్యలను పరిష్కరించుకో గలుగుతున్నామని త్వరగా మీ కంటి సమస్యలు పరిష్కరించకుంటే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: