దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీని ఎదుర్కోవాలంటే కొన్ని కొన్ని పార్టీలు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాలను చాలా సీరియస్ గా   తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనే విషయంలో కొన్ని పార్టీలు ఎక్కువగా తప్పులు చేస్తున్నాయి అనే అంశం కూడా హైలెట్ అవుతుంది.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని అంశాలను తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపి నేతలు ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో కూడా అక్కడి ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అవి ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ కూటమి ఓడిపోయే అవకాశాలు ఉండవచ్చు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెంచడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ దాదాపుగా కృషి చేస్తున్నారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంను నేరుగా టార్గెట్ చేయడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా కర్ణాటకలో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోందని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీపై వ్యతిరేకత ఉంది అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లగలిగితే మాత్రం మంచి ఫలితాలుంటాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: