ఏపీలో జగన్ సర్కార్ కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాల మీద సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. దీని మీద రాజమండ్రీ వైసీపీ నేతలు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశాడు అంటూ మాట్లాడుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఇక ఎటూ విపక్షం తెలుగుదేశం పార్టీ కరోనాను ఎదుర్కొనే విషయంలో ఏపీ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని ఆరోపిస్తోంది. ఇక ఏపీలో కరోనాను నియంత్రిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అంటున్నారు. పూర్తిగా అధికారుల మీద బాధ్యలను పెట్టి కేవలం మోనిటరింగ్ కే ప్రభుత్వ పెద్దలు పరిమితం అయ్యారని విమర్శలు ఉన్నాయి.

కరోనా వేళ  ప్రభుత్వ పెద్దలు ఆసుపత్రులను సందర్శించి అక్కడ పరిస్థితులను గమనిస్తే కచ్చితంగా మార్పు వస్తుంది, ఫీడ్ బ్యాక్ కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది అంటున్నారు. మరో వైపు కరోనా తో బతికినా చావే చచ్చినా చావే అన్నట్లుగా సీన్ ఉంది. ఇక జగన్ ఓ వైపు సంక్షేమ పధకాలను ఎక్కడా ఆపడంలేదు అని  వైసీపీ నాయకులు  చెబుతున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా కూడా కరోనా ఏపీలో తీవ్రంగా ఉంది.

ఏడు జిల్లాల్లో సీరియస్ కండిషన్స్ ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీంతో కరోనా పట్ల ప్రభుత్వం ఇంకా గట్టిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అదే సమయంలో తాము పూర్తి సీరియస్ గా ఉన్నామన్న సందేశం క్షేత్ర స్థాయిలో సిబ్బందికి పంపాల్సిన  అవసరం ఉందని కూడా చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వం సీరియస్ నెస్ మీదనే మొత్తం ఏపీలో  కరోనా ఆపరేషన్ అన్నది న‌డుస్తుంది. గత ఏడాది జగన్ అన్న మాటలనే ఇప్పటికీ విపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. కరోనా పారాసైట్ మాల్ తో పోయేది అన్న మాట వల్ల నాడు నిర్లక్ష్యం  జరిగింది. ఇపుడు కూడా నాన్ సీరియస్ గా ఉండడం వల్లనే కేసులు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.

జగన్ ఇతర అంశాల మీద సమీక్ష రోజూ చేస్తున్నారు. దాంతో పాటు కరోనా మీద కూడా చేస్తున్నారు. అలా కాకుండా కరోనా మీదనే కొన్ని రోజులు పూర్తి దృష్టి పెట్టి సర్కార్ గట్టిగా ఉందని తమ ప్రభుత్వ అధికారులకే బలమైన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు.  పధకాలు ఉంటే చాలా ప్రాణాలు అక్కరలేదా అన్న ప్రతిపక్షాల మాటలు జనాలకు చేరకముందే సర్కార్ మేలుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: