తెలంగాణలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన కొంత మంది కీలక నేతలు త్వరలోనే బిజెపిలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారేందుకు ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం కీలక నేతలు ఖమ్మం జిల్లాలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థికంగా కూడా వాళ్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని అందుకే పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా సరే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

తుమ్మల నాగేశ్వరరావు కడియం శ్రీహరి కూడా వరంగల్ జిల్లాలో పార్టీ మారే అవకాశం ఉంది. కడియం శ్రీహరి ఈటెల రాజేందర్  పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అదే కాకుండా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కూడా అంటున్నారు. అలాగే కొంతమంది మాజీ పరిషత్ చైర్మన్ లు కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన కూడా టిఆర్ఎస్ పార్టీ కీలక నేతల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. అయితే తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఈటెల రాజేందర్ కాస్త ఆసక్తి చూపిస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు తనతో వస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఈటెల రాజేందర్ వ్యక్తం చేశారు అని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: