ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.  పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ జిల్లా లో తన  పై పోలీసులు కేసు  పెట్టారు, వాటికి తాను భయపడను అని తెలిపారు.. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు.. మనము అంత పోరాడి బహుజన రాజ్యం సృష్టించుకుందామని పిలునిచ్చారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బడుగు బలహీన ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతుంటే అధికారంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

సీఎం హుజరాబాద్ లో దళిత బంధు కోసం ఖర్చు పెట్టే వెయ్యి కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెడితే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ మారుతుందని పేర్కొన్నారు. భారత దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ లలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్...  దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం వచ్చి మళ్ళీ మోసం చేస్తారు,అలాంటివి మళ్ళీ రానీయవద్దని తెలిపారు. మనం అంత కలిసి అధికారం దక్కించుకోవాలని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు రాకపోతే ఇటువంటి అవకాశము మళ్ళీ వెయ్యి ఏళ్ళ వరుకు రాదని తెలియ జేశారు.

స్వాతంత్ర్యము వచ్చి 75 ఏళ్ళు అయింది, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ బతుకులు మార్చడానికే తాను తన పదవికి రాజీనామా చేసి.. వచ్చానని పేర్కొన్నారు. తమ కు నిజమైన అభివృద్ధి కావాలని.. అలాగే  అధికారం కావాలనే ఉద్దేశం తో ..ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబములో చాలా బాధ ఉంటుందని తెలిపారు.  కోట్ల మంది బాగుపడాలనే నేను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని  ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగా ఇటీవలే.. హిందూ దేవతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: