ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయా అంటే అవున‌నే చెప్పాలి.. ఎందుకంటే జ‌గ‌న్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్‌లో ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉండాల‌ని మంత్రుల‌కు ఎమ్మెల్యేల‌కు సూచించారు. ఏపీలో ఎన్నిక‌లు జరిగి రెండున్న‌రేళ్లు గ‌డిచాయి. రాబోయే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టి నుంచే కార్య‌చ‌ర‌ణ‌కు దిగాల‌ని మంత్రుల‌కు సూచించడంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇక నుంచి జ‌నం మ‌ధ్య‌లో ఉండాల‌ని ఆదేశించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

 తాను పాద‌యాత్ర స‌మ‌యంలో ఎలా ఊరూరు ఇల్లుల్లి తిరిగానో అదే విధంగా మీరు కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి ఇంటికి వెళ్లి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. ఎమ్మెల్యేల బాధ్య‌త‌లు మంత్రులు చూస్తార‌ని వారికి ఏవిధ‌మైన ప్ర‌జా స‌మ‌స్య ఎదురైనా మంత్రుల దృష్టికి చేప్పాల‌ని, అలాగే వారు తిరుగుతున్నారో లేదో చూడాల్సిన బాధ్య‌త మంత్రుల‌దేన‌ని చెప్పారు. ఎవ‌రు వెన‌క‌బ‌డినా, వ్య‌తిరేక‌త వ‌చ్చినా త‌న దృష్టికి తీసుకురావాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.  


2024 లో జ‌రిగే ఈ ఎన్నిక‌లకు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహ‌క‌ర్త‌గా ఉంటార‌ని తెలిపారు. పీకే బృందం 2022 క‌ల్ల రాష్ట్రానికి వ‌స్తుంది. వారు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గుతారు. ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయం తెలుసుకుంటారు. అలా అక్క‌డ ఎదురైన ప‌రిస్థితుల‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలో ఆయ‌న సూచిస్తార‌ని ఆ ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని తెలిపారు సీఎం జ‌గ‌న్‌.
 

    ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌లో రోడ్ల ప‌రిస్థితి, రైతుల‌కు మేలు చేయ‌డం లేద‌ని, పోల‌వ‌రం ముంపు బాధితుల విష‌యాల‌ను అస్త్రాలుగా చేసుకుని ప్ర‌తిప‌క్ష పార్టీలు ముందుకు వ‌స్తున్నాయి. ఎలాగైన ముఖ్యమంత్రి సీటుపై చంద్ర‌బాబును కూర్చోబెట్టాల‌ని రాజ‌గురూ ప్ర‌ణాళిక వేస్తున్నార‌ని అంద‌రూ అనే మాట.. ఎలాగైన జ‌గ‌న్ పార్టీని ఓడించి దూసుకుపోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నారు. అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా అదే రీతిలో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌కు సిద్దం అవుతున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పీకే ఎంట్రీ ఇస్తార‌నే చర్చ ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: