తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన నడుస్తోంది.. ఇప్పటికే వారిచ్చిన 6 గ్యారంటీలలో చాలావరకు అమలు చేసి ప్రజల మన్ననలు ఎలాగైనా పొందాలని కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇదే తరుణంలో కేసీఆర్ చేసిన పనులను తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్  స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. దీనికంటే ముందు రెండు పార్టీలు జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికలో సత్తా చాటాలని చూస్తున్నాయి.ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో టిడిపి అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక  అనివార్యమైంది. 

ఇదే క్రమంలో అక్కడ పట్టు సాధించాలని బీఆర్ఎస్, ఇక్కడ ఓడిపోతే పరువు పోతుందని కాంగ్రెస్ తన బలాన్ని చూపించడానికి సమాయత్తమవుతోంది. ఇదే తరుణంలో బిజెపి,జనసేన, టిడిపి మూడు పార్టీలు  ఒక్కటిగా ఏర్పడి ఇక్కడ పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. ఎందుకంటే గోపీనాథ్ సంబంధించిన ఫ్యామిలీ కాస్త టీడీపీతో కూడా సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రాకు సంబంధించిన చాలా మంది వ్యక్తులు ఇక్కడ స్థిరపడి ఉన్నారు.. ఈ విధంగా మూడు పార్టీలు పోటా పోటీగా ఉన్న తరుణంలో తాజాగా నారా లోకేష్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. అయితే గోపీనాథ్ మరణం తర్వాత లోకేష్ ఆయనకు నివాళులర్పించారు.

ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.. ఇదే క్రమంలో బీఆర్ఎస్ మళ్లీ గోపీనాథ్ కుటుంబం నుంచే పోటీ చేయించడానికి సమాయత్తమవుతున్న తరుణంలో  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి  ఈ ఎన్నికపై చర్చించినట్టు తెలుస్తోంది. అక్కడ టిడిపి నుంచి మీరు పోటీ చేయొద్దని ఆయన్ని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. టిడిపి పోటీ చేయకుంటే అక్కడ బీఆర్ఎస్ కు బలం చేకూరుతుంది. దీనివల్ల అక్కడ విజయం సాధించవచ్చు అని కేటీఆర్ లోకేష్ తో భేటీ అయినట్టు సమాచారం. మరి దీనిపై లోకేష్ ఓకే చెబుతారా లేదంటే పోటీకి సమాయత్తమవుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: