ఆమె రాజ‌కీయాల‌కు కొత్త‌. అయినా.. పాత నాయ‌కుల‌కు మించిన వ్యూహాల‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతు న్నారు. స‌మ‌స్య‌ల‌తో ఎవ‌రు వ‌చ్చినా.. ఆమె త‌న పాత్ర‌ను నిర్విఘ్నంగా పోషిస్తున్నారు. రాజ‌కీయాల‌ను కేవ‌లం ఎన్నిక‌ల‌కే ప‌రిమితం చేయాల‌న్న వ్యూహంతోనూ ముందుకు సాగుతున్నారు. ఆమే.. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి. గ‌తంలో తెలుగు మ‌హిళ‌.. విభాగంలో ప‌నిచేసిన ఆమె.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించారు.


ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప‌ట్టున్న నాయ‌కురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఉన్న‌త విద్యావంతురా లు కావ‌డంతో స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకోవ‌డంలోనూ.. వాటిని ప‌రిష్క‌రించ‌డంలోనూ ముందున్నా రు. అంతేనా.. వివాదాల‌కు దూరంగా ఉంటారు. విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా వ‌చ్చే గుర్తింపు క‌న్నా కూడా.. ప‌నులు చేయ‌డం ద్వారా వ‌చ్చే గుర్తింపు ఎక్కువ అని భావించే వారిలో బండారు శ్రావ‌ణి కీల‌కంగా వ్య‌వ‌హ రిస్తున్నారు. వారం వారం ఖ‌చ్చితంగా ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హిస్తున్నారు.


నెల‌లో రెండు సార్లు.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి మండ‌లంలోనూ.. ప‌ర్య‌టిస్తున్నారు. నిజానికి ఇత‌ర నియో జ‌క‌వ‌ర్గాల్లో మాదిరిగా.. ఇక్క‌డ ఆమెకు ప్ర‌త్య‌ర్థుల నుంచి సెగ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అనంత‌పురం పాలి టిక్స్ అంటేనే.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఎమ్మెల్యేకు.. సొంత పార్టీలోనే ప్ర‌త్య‌ర్థులు ఎక్కువ‌. ఉదాహ ర‌ణ‌కు పెనుకొండ‌, ధ‌ర్మ‌వ‌రం, రాప్తాడు వంటివి క‌నిపిస్తాయి. కానీ, శింగ‌న‌మ‌ల‌లో ఒక‌ప్పుడు జేసీ వ‌ర్గం చ‌క్రం తిప్పేది. కానీ, బండారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒడుపుగా ప్ర‌త్య‌ర్థుల‌ను లైన్‌లో పెట్టుకున్నారు.


వారి స‌మ‌స్య‌ల‌ను కూడా వింటున్నారు. త‌న ప‌రిధిలో ఉంటే.. త‌క్ష‌ణే స్పందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాగు, తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీస‌కురావ‌డంలోనూ.. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డంలోనూ శ్రావ‌ణి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొత్త‌గా ఆమె గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకు న్నా.. పాత నాయ‌కుల‌ను కూడా క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇక‌, వైసీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జీరో కావ‌డం.. ఆ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రూ గ‌ళం వినిపించే నాయ‌కులు కూడా లేక‌పోవ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: