ప్రస్తుతం దేశంలో భారతీయుడుగా ఉండాలంటే తప్పనిసరిగా వారికి ఒక ఐడెంటి కార్డు ఉంటుంది. అదే ఆధార్ కార్డు.. ఈ కార్డు వివరాలు కొడితే వారు ఎక్కడి వ్యక్తులు అనేది పూర్తిగా డేటా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఆధార్ కార్డుతో మన ఇండియన్స్ ని ఈజీగా గుర్తించవచ్చు. దీని వల్ల ఎక్కువ నేరాలు కూడా జరగడానికి ఆస్కారం ఉండదు. కానీ ఆధార్ తో సరికొత్త కష్టం వచ్చింది. అదేంటటో ఆ వివరాలు  చూద్దాం.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఏదైనా కొనాలన్నా బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా.. వేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ అనేది అవసరం. అయితే బ్రతికున్నప్పుడు ఆధార్ తో ముడిపడి ఉన్న మనిషి జీవితం చనిపోయిన తర్వాత కూడా అదే ఆధార్ కార్డుతో కొంతమంది దాన్ని మిస్ యూస్ చేసే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయట. 

నగరాల్లో చనిపోయిన వ్యక్తిని స్మశాన వాటికలో ఖననం చేస్తే అక్కడ ఆధార్ వివరాలు ఎంటర్ చేసుకుంటారు. వారు ఇచ్చిన స్లిప్పు ద్వారా మున్సిపాలిటీలో డెత్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. కానీ చాలామంది ఈ డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటేనే డెత్ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. కానీ పల్లెల్లో చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తులను ఎక్కడపడితే అక్కడ ఖననం చేస్తారు. చనిపోయిన వ్యక్తుల మీద ఏదైనా ఆస్తులు ఉంటే తప్ప వారు గ్రామపంచాయతీలో నమోదు చేసుకుంటున్నారు లేదంటే సైలెంట్ గా ఊరుకుంటున్నారు. ఇలాంటి వారి కార్డులను వేరే వాళ్ళు మిస్ యూస్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

 అంతేకాదు కొంతమంది చనిపోయిన వారి ఆధార్ కార్డు పై సంక్షేమ పథకాలను తీసుకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. గత 14 సంవత్సరాలలో డియాక్టివేషన్ అయిన ఆధార్ కార్డులు ఒక కోటి 14 లక్షలు మాత్రమే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తులు కనీసం 8కోట్ల మంది ఉన్నారు. ఇందులో కనీసం రెండు కోట్ల మంది డియాక్టివేషన్ చేసుకున్న ఇంకోటి అటూ ఇటూ గా తీసేసిన  ఇంకా నాలుగు కోట్ల మంది చనిపోయిన ప్రజల ఆధార్ కార్డులు ఇప్పటివరకు యాక్టివేట్ చేయలేదని వీరి వల్ల దేశానికి ఎంత నష్టం జరుగుతుందనేది ప్రస్తుతం మేధావులు అంచనా వేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెడుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: