సాధారణంగా సినిమా కథ నచ్చితే ఏ భాషతో సంబంధం లేకుండా రీమేక్ చేసి విడుదల చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం ఇటీవలి కాలంలో చాలా సహజం అయిపోయింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరూ రీమేక్ చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్‌, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు రీమేక్ సినిమాలనే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఒరిజినల్ కథల కంటే రీమేక్ చిత్రాలే ఈ మధ్య ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మంచి సినిమా విజయాన్ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. అయితే రీమేక్ చిత్రాల హవా ఎప్పుడు మొదలైంది..? అసలు తెలుగులో రీమేక్ అయిన తొలి చిత్రం ఏది..? వంటి విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు. ఆ విషయాన్ని ఒక్కసారి చూద్దామా.

వాస్తవానికైతే రీమేక్ సినిమా హవా ఈనాటిది కాదు.. 1950వ సంవత్సరంలో స్టార్ అయ్యింది. అయితే తెలుగులో రీమేక్ అయిన తొలి మూవీ ‘ఆహుతి’. ఈ సిినిమా హిందీలో విజయవంతమైన ‘నీరా ఔర్ నందా’ సినిమాకు రీమేక్‌. ఈ సినిమాను ఆర్.ఎస్. జున్నాకర్ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో జయసింహ, శశి, నిశి బరన్, జి. షావుకార్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ అంతా ఔట్ డోర్ లోనే జరగడం విశేషం అనే చెప్పాలి మరి.

అయితే ఈ సినిమాను నవీన ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించగా.. ఈ మూవీకి సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. అంతేకాదు.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు మాటలు పాటలు రాయడం ద్వారానే శ్రీ శ్రీ వెండితెరకు పరిచయమయ్యారంట. ఇక కుల వివక్షతకు బలైన ప్రేమికులను ఆదర్శంగా తీసుకొని రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కాగా.. అప్పటి నుంచి ఇతర దర్శకులు, నిర్మాతలు కూడా రిమేక్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: