బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కు నాగ్ బ్రేక్ తీసుకున్నాడు.. అందుకు కారణం కూడా నాగ్ వీడియో ద్వారా తెలిపాడు. మన్మథుడు 2 తర్వాత నాగ్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మంచి ప్రయోగాత్మక కథా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వైల్డ్ డాగ్ అనే సినిమాతో కొత్త దర్శకుడికి లైఫ్ ఇవ్వబోతున్నాడు. సస్పెన్స్ గా సాగే ఈ సినిమా షూటింగ్ గతంలో మొదలైంది.. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది.ప్రస్తుతం హిమాలయాల్లో ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ కి హోస్ట్ గా ఉన్న నాగ్ ఇప్పుడు సినిమా కారణంగా ఆ బాధ్యతను కోడలు సమంత కు అప్పగించారు.



ఈరోజు జరిగిన వీకెండ్ షో లో సామ్ తన స్టయిల్లో ఆకట్టుకోవడం తో పాటుగా గ్లామర్ ను కూడా జోడించడంతో షో హైలెట్ అయింది. ఎప్పటి లాగే బిగ్ బాస్ హౌస్ మెట్స్ పులిహోర కలిపే పనిలో ఉన్నారు.. ఎలా హౌస్ లోకి వచ్చి రాగానే సమంత అందరి రహస్య  చిట్టాలను బయట పెట్టింది. మొత్తానికి అఖిల్ ను టార్గెట్ చేసింది..బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అమ్మాయిల బలం, బలహీనతల్ని గురించి చక్కగా చెప్పిన సమంత.. అబ్బాయిలు తమ బలం ఏంటి.. బలహీనత ఏంటి అని చెప్పాలని కోరినప్పుడు అఖిల్‌లోని కమల్ హాసన్ మరోసారి బయటకు వచ్చేశాడు.



 ఈ సందర్బంగా అఖిల్ మాట్లాడుతూ నా బలం ఏంటంటే నేను చాలా ముక్కుసూటి మనిషిని.ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పేస్తా. నాలో ఓపిక కూడా చాలా ఎక్కువ. అలాగే నా బలహీనత. ఎవరైనా అబద్ధం ఆడితే అస్సలు నచ్చదు. కోపం వచ్చేస్తుందని చెప్పాడు. మీకు మోనాల్ కు మద్య ఏదో ఉందని అంటున్నారు. మీ మాటలోనే చెప్పండి అంటూ కోరింది..దీంతో ఒక కథను అల్లాడు.. ఇది విన్న సామ్ మోనాల్ ఎలిమినెట్ అయితే ఏం చేస్తావు అని అడిగింది..నో ఎలిమినేట్ కాదు.. నాకు తెలిసి ఈరోజు ఎలిమినేషన్ ఉండదు’ అని చెప్పాడు అఖిల్.మొత్తానికి మనోడి మనసులోని మాటను బయట పెట్టేశాడు.. ఇది కాస్త వైరల్ అయ్యి కూర్చుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: