డ్రైవింగ్ లైసెన్స్ అనగా టూవీలర్,  ఫోర్ వీలర్ వంటి వాహనాలను నడుపుటకు కావలసిన  అనుభవానికి తగ్గట్టు ఒక సర్టిఫికెట్ ఇవ్వడాన్ని  డ్రైవింగ్ లైసెన్స్ అంటారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. కేంద్ర రోడ్డు రవాణా తోపాటు రహదారుల మంత్రిత్వ శాఖ రాబోయే నెలల్లో డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన అన్ని సంబంధాలను ఆన్లైన్ చేయబోతోంది..ఇప్పటికే యూపీ, బీహార్,మధ్యప్రదేశ్,జార్ఖండ్,హర్యానా,ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా సేవలు ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. మార్చి నుంచి దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో దాదాపు అన్ని సేవలు ఆన్లైన్లోనే ప్రారంభమవుతాయి. మోడీ సర్కార్ సూచనమేరకు ఆయా దేశాల్లోని రవాణా కార్యాలయాల (RTO ) పనులన్నీ క్రమంగా ఆన్లైన్లోకి మారిపోతున్నాయి.


ఇకమీదట డ్రైవింగ్ లైసెన్స్ లు పునరుద్ధరణ తో పాటు డూప్లికేట్ లైసెన్స్ తో పాటు అడ్రస్ మార్పు  (RC) కోసం ప్రజలు పదేపదే ఆర్ టీ ఓ ఆఫీస్ కు రావాల్సిన పనిలేకుండా రవాణా శాఖ ప్రయత్నిస్తోంది. ఇంటి దగ్గర నుంచి ఆయా వ్యక్తుల పత్రాలు అప్లోడ్ చేసి, పరీక్షలు ఇవ్వడానికి మాత్రమే ఆర్ టీ వో కార్యాలయానికి రావాలనే విధంగా ఏర్పాటు చేస్తోందట.

ఆన్లైన్ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత,  డ్రైవింగ్ టెస్ట్, ఫిట్నెస్ కోసం మాత్రమే ఆర్టీవో ఆఫీస్ కు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మార్చి నెల నుండి ఆన్ లైన్ లోకు మార్చబడుతోంది అని చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అమలులో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు లెర్నింగ్ లైసెన్స్ లో నమోదు కోసం కొత్త నిబంధన అమలు చేశాయి.


అంతే కాదు, డిఎల్  ఫీజు చెల్లించే విధానంలోనూ విశేషమైన మార్పు తెచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫీజులు జమ చేసే విధానంలో దేశంలోని అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మార్పు చేసింది. ఇప్పుడు తెచ్చిన కొత్త స్మార్ట్ వ్యవస్థ ప్రకారం, స్లాట్ బుక్ అయిన వెంటనే సదరు అభ్యర్థులు లెర్నింగ్ లైసెన్స్ కోసం డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. జమ అయిన వెంటనే మీకున్న వెసలుబాటు సౌలభ్యం  ప్రకారం పరీక్ష తేదీ ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.

ఇలా చేయడం వలన డ్రైవింగ్ లైసెన్స్ సహా మిగతా సేవలకు ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. అంతే కాకుండా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు,ఆశావహులు రవాణా శాఖ యొక్క వెబ్ సైట్ కి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ సేవల పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫారం నింపేటప్పుడు మీ డిఎల్ నెంబర్ తో పాటు మరింత వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ విధానం పరిశీలించిన తర్వాత మీ అన్ని పత్రాలు తొలగించబడతాయి.దీని తర్వాత మీ లైసెన్స్  పునరుద్ధరించబడింది.  ఇదే కూడా అమలు అయితే ఇకమీదట అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలు తీరినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: