మాములుగా ఒక ఇల్లు అంటే ఎలా ఉండాలి. ఎలాంటి ఇంట్లో మనము సంతోషంగా ఉండగలం అంటే ప్రతి ఒక్కరి నోటా వచ్చే మాట. ముందుగా ఇంటిలో ఉండడానికి నీరు సమృద్ధిగా ఉండాలి. పవర్ ఉండాలి మరియు ఇప్పుడున్న జనరేషన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉండడానికి అనువుగా ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇవన్నీ లేకుండా ఒక ఇల్లు ఉందట ? అయితే ఆ ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే కళ్ళు తిరిగి కిందపడతారు. మరి ఆ ఇంటి కున్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందామా. ఇంగ్లాండ్ దేశంలో సముద్రం పక్కన అటువంటి ఒక కాటేజీ ఉందాహాని తెలుస్తోంది. ఆ కాటేజీ దగ్గర వాతావరణం ఎలా ఉందంటే, పక్కనే ఒక అందమైన సముద్రం ఉందట... అంతే కాకుండా ఆ కాటేజీ చుట్టూ కొండలు, పచ్చని చెట్లు ఉన్నాయి.

వాటి నుండి వీచే చిరుగాలి. ఇవన్నీ చూస్తుంటే స్వర్గమే కిందకు వచ్చినట్లు ఉంది. ఇలాంటి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఇల్లు ఉంటే ఎవ్వరికైనా హాయిగా ఉంటుంది. కానీ ఇన్ని సంతోషకరమైన వాతావరణంగా ఉన్నా కూడా మనము ముందుగా చెప్పుకున్న ప్రకారం అత్యవసరమని నీరు, కరెంట్ మరియు ఇంటర్నెట్ లాంటివి లేవు. కానీ ఇలాంటివి అన్నీ లేకపోయినా కూడా ఆ దేవన్ కాటేజీ ధర ఎంతో తెలుసా అక్షరాలా 5.56 కోట్లు అని తెలుస్తోంది. కానీ పైన మనము చెప్పినవి ఏవీ లేకపోయినా పర్వాలేదు అనుకున్న వారు మాత్రం ఈ దేవన్ కాటేజీ ని కొనుక్కోవచ్చు. మైరి ఎంత నచ్చినా అంత మొత్తానికి ఎవరైనా కొంటారా అనే సందేహం ఉంది.

అయితే బాగా డబ్బుండి ప్రశాంతంగా ఈ బాధలు లేకుండా జీవించాలి అనుకునే వారికి ఈ కాటేజీ బాగా నచ్చుతుంది. మరి ఎవరు ముందుకు వస్తారో తెలియాల్సి ఉంది. మరి కొనుక్కుంటే ఎలాగోలా ఉండాలి కాబట్టి. అన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తగిన వసతులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం మాత్రం పెద్ద సాహసమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ కాటేజీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: