ప్రపంచం చాలా ముందుకు వెళ్లుతుంది.. ఎంతగా అంటే ప్రస్తుత పరిస్దితుల్లో మనుషులు చేసే పనులను కూడా రోబోలతో చేయిస్తున్న రోజులు.. మనుషులకు వీలుపడని పనులను కూడా రోబోల సహాయంతో సునాయాసంగా చేస్తున్నారు.. ఇక అభివృద్ధి చెందిన టెక్నాలజీ సహాయంతో దేన్నైనా తయారు చేయొచ్చు అని వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు..

 

 

అంతే కాకుండా నేటికాలంలో రోబోలు లేని రంగం లేదు, అయినా మనిషి ఆశ తీరలేదు. ఇంకా తాను చేయలేని పనులెన్నింటినో రోబో చేత చేయించాలనుకుంటున్నాడు. అందుకని, వాటికి కృత్రిమ మేధను జోడించాడు. పక్షులూ జంతువుల కదలికలు నేర్పాడు. ఎక్కడికక్కడ మనిషి అవసరానికి తగిన ఆకారాన్నిచ్చాడు. ఇలా ఎన్నో రకాలుగా తన అభివృద్ధికి మనిషి బాటలు వేసుకుంటున్నాడు.. ఈ క్రమంలోనే బోస్టన్ డైనమిక్స్ గ్రూప్ నుండి వచ్చిన ఒక క్వాడ్రప్డ్ రోబో కుక్క, నిజమైన కుక్క దృష్టిని ఆకర్షించగా, తనలాగే కదులుతున్న ఆ మరమనిషి ఏంటో దానికి అర్ధం కాక దాని చుట్టే మొరుగుకుంటూ తిరుగుతుంది.. ఉన్నచోట నుండి కదలనీయకుండా అది ఎటు మళ్లితే అటుగా అరుస్తూ ఆ రోబో కుక్కకు అడ్దుగా వెళ్లుతుంది.. ఇదంతా ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కనిపించే దృశ్యాలు..

 

 

ఇక ఈ రోబోను సృష్టించిన విద్యార్ధులు అక్కడే ఉండి దీన్ని ఆపరేట్ చేస్తుండగా, ఈ రోబో కుక్కతో నిజమైన శునకం వేస్తున్న వేశాలను మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.. ఈ ఫన్నీ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి.. ఇకపోతే ఈ మధ్యకాలంలో అన్ని దేశాల్లో రోబోల వినియోగం ఎక్కువైందన్న విషయం తెలిసిందే.. రానున్న కాలంలో మనుషుల జీవితాల్లో ఈ రోబోలు ఒక భాగంగా మారిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.. ఎందుకంటే కొందరు ఇప్పటికే అతి ముఖ్యమైన పనుల్లో ఈ రోబోలను ఉపయోగిస్తున్నారు.. ఈ రోబోలు లేకుంటే కొన్నిపనులు జరగని స్దాయికి వీటిని ఎదిగించాడు మానవుడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: