సోషల్ మీడియా అనేది ప్రతిఒక్కరికీ ఇప్పుడు ఓ అద్భుత ప్రపంచం. ప్రతిరోజు కొత్తకొత్తగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు భయభ్రాంతులకు లోను చేస్తే.. మరికొన్ని వీడియోలు చాలా ఫన్నీగా.., మరికొన్ని వీడియోలు ఆలోచించే విధంగా ఉండటం గమనిస్తూనే ఉంటాం. ముఖ్యంగా కొందరు పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వీటివల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాకుండా.. అందులో కొందరు సెలబ్రిటీలు కూడా అయ్యారు. ఇకపోతే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 


మామూలుగా అడవిలో చిరుత జంతువులను వేటాడుతూ ఉండడం సహజమే. తనకు దొరికిన జంతువులను అది వెంటాడి వెంటాడి అతి క్రూరంగా చంపి తింటుంది. ఇది ఇలా ఉండగా కోతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోతులు  మిగతా జంతువులను ఏదైనా సరే వాటి చిలిపి చేష్టలతో ముప్పుతిప్పలు పెడుతుంటాయి. ఎందుకంటే ఆ కోతులు చేసే అల్లరి అంతా ఇంతకాదు కాబట్టి. అందుకే కాబోలు కోతులు ఏ చేష్టలు చేసినా కూడా వాటిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇకపోతే ఓ కోతి చేసిన అల్లరి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి చెట్టు  కొమ్మపై ఎక్కి కూర్చుని ఉండగా వేటాడేందుకు అక్కడికి ఓ ఆకలితో ఉన్న చిరుత వచ్చింది. ఆ సమయంలో కోతి తన అల్లరి చేష్టలతో చిరుతకు ముచ్చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను పరిశీలిస్తే కోతిని వేటాడే క్రమంలో చిరుత బాగా అలసిపోయింది. ఆ సమయంలో కోతి, చిరుతపులి యొక్క కదలికలు అందర్నీ నవ్విస్తాయి. ఇకపోతే ఈ వైరల్ వీడియోను లైఫ్ అండ్ నేచర్ తన  ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: