కడుపుల పుట్టిన బిడ్డలకు ఏదైనా కష్టం కలిగితే.. ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. గుండెల్లో తీరని ఆవేదన కలుగుతుంది. కళ్లు మూసినా తెరిచినా.. అచేతనంగా కనిపించే పిల్లలే కదలాడుతారు. ఇక ఆటిజంతో అల్లాడే పిల్లల కష్టం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. చేతిలో కాస్త డబ్బులున్నా.. వైద్యం అందించాలనే కోరిక ఉన్నా.. ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్తలు పడే పేరెంట్స్ ఎంతో మంది ఉన్నారు. వారి వేదనను వర్ణించలేం.

ఆటిజం పూర్తిగా నయం కావాలంటే చాలా థెరెపీలు అవసరం. అన్ని చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. కానీ అవన్నీ ఒకే దగ్గర ఎక్కడ ఉంటాయి? ఎవరు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పారు సరిపల్లి శ్రీజారెడ్డి.
ఆటిజం నుంచి సాంత్వన పొందే వైద్య సదుపాయాలన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చారు
శ్రీజారెడ్డి దంపతులు. వైద్యం ఒక్కటే కాదు.. అన్నిరకాల థెరఫీలను ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. డబ్బులు ఖర్చయినా ఫర్వాలేదు.. అన్ని సేవలు ఒకే దగ్గర దొరికేలా చేశారు.

దీనికి కారణం తమ కొడుకు పడిన వేదనే అంటారు శ్రీజారెడ్డి. తమ బిడ్డకు వచ్చిన ఆటిజం సమస్యను తప్పించుకునేందుకు
శ్రీజా దంపతులు నానా ప్రయాసలు పడ్డారు. పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలు తిరిగారు. చిల్డ్రన్ స్పెషలిస్టులను కలిశారు. మానసిక చికిత్స నిపుణుల దగ్గరికి వెళ్లారు.

వీరంతా ఒకే చోట లేకపోవడంతో తీవ్ర వ్యయ, ప్రయాసలకు ఓర్చుకున్నారు. తమలా మరే కుటుంబ సభ్యులు బ్బందులు పడకూడదనే గొప్ప ఆలోచన చేశారు. ఆటిజంతో ఇబ్బంది పడే వేలాది మంది చిన్నారుల తల్లిదండ్రులకు మేలు కలిగేలా.. హైదరాబాద్‌లో పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
పినాకిల్ బ్లూమ్స్ సంస్థలో మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా టెక్నాలజీ, ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, స్పీచ్, లాంగ్రేజ్ పాత్, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ ఇలా అనేక సదుపాయాలున్నాయి. ఆటిజం చిన్నారులు ఇక్కడికి వస్తే సమస్య పూర్తిగా తీరిపోతుంది.
తెలంగాణ,
ఏపీ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మస్యలు పరిస్కరించుకుని వెళ్తున్నారు. పినాకిల్ బ్లూమ్స్ మూలంగా తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. చిన్నారుల ఆటిజం సమస్య పరిష్కారానికి
శ్రీజారెడ్డి చేస్తున్న కృషికి అభినందనుల చెప్తున్నారు ఎందరో మాతృ మూర్తులు. వేలాది పిల్లల జీవితాలకు స్వర్ణబాటలు వేస్తున్న శ్రీజారెడ్డికి..
వేలాది మంది మాతృమూర్తుల తరఫున మాతృదినోత్సవ శుభాకాంక్షలు..