ఇండియా హెరాల్డ్ సంస్థ అధినేత కోటిరెడ్డి గా రి సతీమణి శ్రీజ రెడ్డి గురించి పరిచయం అక్కర్లే దు.. ఎంతో మంది చిన్నారు ల బతుకుల్లో వెలుగులు నింపుతున్న ఆమె  తాను పడ్డ కష్టాన్ని ఏ తల్లి కూ డా అనుభవించ కూడదు అని పినాకిల్ బ్లూమ్స్ అనే మానసిక రుగ్మతలను పోగొట్టే క్లినిక్ లను ఏర్పాటు చేశారు. కోటిరెడ్డి,  శ్రీజరెడ్డి ల తనయుడు ఈ అంతుచిక్కని రుగ్మతలతో బాధపడుతున్న సమయంలో ఆమె చెందిన ఆవేదన అంతా ఇంతా కాదు..


సాధారణంగా ఓ తల్లి కొడుకు గురించి పడే ఆవేదన ఎవరికి చెప్పేది కా  దు.. లోలోపల ఎంతో కుమిలిపోతూ తన కుమారుని భవిష్యత్తు ఇలా అయిపోతుంది అన్న భయం తో వారి స్టేటస్ ఆఫ్ మైండ్  ఉంటుంది.. వాటిని ఎదురించి, బాధను దిగమింగుకుని తన కొడుకును ఎలాగైనా బాగు చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.. ఈనేపథ్యంలో వారికి ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితుల రీత్యా డబ్బు కట్టలే ని పరిస్థితిలో వాటన్నిటినీ నెగ్గుకొచ్చి వారి కొడుకును ఈ మానసిక రుగ్మతల నుంచి కాపాడుకున్నారు..



ఓ ఝాన్సీ లక్ష్మీబాయి లా కష్టాలతో ఆమె చేసిన ఈపోరా ట ఫలితమే పినాకిల్ బ్లూమ్స్.. ప్రపంచ జనాభాలో 70  శాతం మంది రకరకా ల న్యూరలాజికల్‌ కండిషన్స్, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వాళ్ల సర్వే ద్వారా తెలిసింది. ఆ సమస్యలు.. ఆటిజం కావచ్చు, సెరిబ్రల్‌ పాల్సీ, చిన్న చిన్న ఫోబియాలు, మాటలో లోపాలు, స్ట్రెస్, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాల నే తలంపు, వైవాహిక బంధాల లో సమస్యలు.. ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారున్నారని తెలిసింది. వీరిని పిల్లల చిన్న వయసులోనే గుర్తించి వాటికి తగిన చికిత్స చేయడమే ఈ పినాకిల్‌ బ్లూమ్స్‌ లక్ష్యం.. దీనిద్వారా ఎంతోమంది పిల్లలు తమ రుగ్మతలనుంచి కోలుకోగలిగారు..















మరింత సమాచారం తెలుసుకోండి: