నేటి మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ, వీరిలో మేటి మహిళలు ఎందరు ఉన్నారు ? అని లెక్క పెట్టు కుంటే.. ఒకరిద్దరు తప్ప ఎవరూ పెద్దగా కనిపించరు. ఇలాంటివారిలో ముందు వరుసలో నిలుస్తారు.. డాక్టర్ శ్రీజారెడ్డి. పుట్టుకతోనే ఆటిజం.. అనే బుద్ధిమాంద్యం సమస్యను ఎదుర్కొంటున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు పూలు విరబూయిస్తున్నారు శ్రీజారెడ్డి. ఆటిజం అనేది ఒక ప్రత్యేక అవస్థ. ఇది వివిధ రూపాల్లో ఉంటుంది. కొందరిలో వాయిస్ ఉండదు. మరికొందరిలో గుర్తింపు లక్షణాలు ఉండవు. మరి కొందరికి వినపడదు.. మరి కొందరు చూడలేరు.. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి.

ఇంకొందరిలో ఆకలి ఉండదు. చాలా మంది ఆటిజం బాధితులుల చొంగకారుస్తుంటారు. వాళ్లు ఏం చేస్తున్నారో.. ఏం తింటున్నారో కూడా తెలియదు. ఇలాంటివారికి వైద్యం అందించడం అనేది అంత తేలిక విషయం కాదు. ప్రభుత్వాలే చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. పైగా ఒక్క వైద్యునితో ముడిపడిన వ్యవహారం కాదు. రకరకాల వైద్యులను సంప్రదించి.. వైద్యం అందించాల్సి ఉంటుంది. మరి ఎంత డబ్బున్నవారికైనా.. ఇంత మంది వైద్యులను కలిసి.. ఎంతో సమయం వెచ్చించి చిన్నారులకు వైద్యం చేయించడం కష్టమే.

ఈ కష్టాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన డాక్టర్ శ్రీజారెడ్డి.. దాదాపు వంద మంది వైద్య బృందాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. సైకాలజీతో పాటు వైద్య రంగంలో ఉన్నత
విద్య అభ్యసించిన ఎంతో మంది వైద్యులను దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఏకీకృతం చేసి మరీ పిల్లలకు థెరపీ చేయిస్తున్నారు. వీరితో ఆటిజంతో బాధపడే చిన్నారులకు వైద్యం చేరువ చేశారు.

అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ .. తన సొంత బిడ్డలా చూసుకుంటూ.. వారికి వైద్యం అందేలా. చికిత్సకు ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటి శిక్షణ ఇవ్వాలి? అనే విషయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇక్కడ చేరిన చిన్నారులు వేగంగా కోలుకుంటున్నారు. అందుకే
శ్రీజారెడ్డి నేటి మహిళల్లో మేటి మహిళగా నిలిచారనడంలో సందేహం లేదు.