మావోయిస్ట్‌ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె మృతి చెందారని సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు తెలుస్తోంది. రామకృష్ణ మృతి చెందిన విషయాన్ని చత్తీస్‌గఢ్‌ పోలీసులు ధృవీకరించారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమార్- బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత రామకృష్ణ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అనారోగ్యం బారిన పడిన ఆయనకు సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో పరిస్థితి విషమించి చనిపోయినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. మావోయిస్ట్‌ పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు జోనల్‌ కమిటీకి సలహాదారుడుగా, ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఆర్కే.. మొత్తం మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. 2018 మే నెలలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకున్నాడు. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ౩౦ మంది మావోయిస్టులు మృతి చెందారు. నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆర్కే.. కొంతకాలంగా అనారోగ్యం బారిన పడ్డారని, సరైన వైద్యం అందకపోవడంతో మృతి చెందారని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: