క‌రోనా వైర‌స్‌కు మందులేదు.. వ్యాక్సిన్ రావ‌డానికి ఇంకా చాలా కాల‌మే ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. రోజుకు కొన్నివేల‌మందిని బ‌లితీసుకుంటున్న క‌రోనా బారి నుంచి బాధితుల‌ను కాపాడుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు సాగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఇత‌ర రోగాల నివార‌ణ‌కు వాడే మందుల‌నే తాత్కాలికంగా క‌రోనా చికిత్స‌లో వాడుతున్నారు. మలేరియా నివార‌ణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెట‌మాల్‌ను వాడుతున్న వైద్యులు.. ఇప్పుడు మ‌రో మందును కూడా ఉప‌యోగించేందుకు రెడీ అవుతున్నారు.  గుండెలో మంటను తగ్గించే ఫామోటిడిన్ మాత్ర‌ల‌ను కరోనా చికిత్సలో వినియోగించాలని అమెరికా వైద్యులు అనుకుంటున్నారు.

 

ఇందుకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించేందుకు దాదాపు 187 మంది పేషెంట్లు పేర్లు కూడా నమోదు చేశారు. ఫామోటిడిన్‌ మందు ప్రయోజనకరంగా ఉంటుందని ఫీన్‌స్టెన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కెవిన్‌ ట్రేసీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీని పనితీరుపై క్లినికల్‌ ట్రయల్స్‌లో స్పష్టత వస్తుందన్నారు. ఒక‌వేళ‌..ఈ విష‌యంలో సానుకూల ఫ‌లితాలు వ‌స్తేమాత్రం.. కరోనాకు విరుగుడు క‌నిపెట్టే ప‌నిలో మ‌రో ముంద‌డుగు వేసిన‌ట్టేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఊడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: