మహారాష్ట్రలో కోవిడ్ విజృంభించేస్తోంది. రోజురోజుకీ కుప్పలు తెప్పలుగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ త‌న‌వంతు సాయం ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీ రిఫైనరీల్లో ఉత్ప‌త్త‌య్యే ఆక్సిజన్‌ను ముంబ‌యికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ ఇండస్ట్రీ గుజరాత్‌లోని జామ్‌నగర్లో ఉంది. అక్క‌డినుంచి ఉచితంగా ఆక్సిజన్‌ను ముంబ‌యికి ఇవ్వ‌నున్నారు. రిలయన్స్ ఉన్నతాధికారి ఒకరు ఈ స‌మాచారాన్ని వెల్లడించారు. మరోవైపు ఇదే విషయాన్ని మహారాష్ట్ర మంత్రి ఏకనాథ్ షిండే కూడా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘గుజరాత్‌లోని జామ్‌నగర్ రిలయన్స్ సంస్థ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు వస్తోంది. థానే జిల్లా కలెక్టర్‌, రాయ్‌గఢ్ డివిజనల్ కమిషనర్, ఎఫ్‌డీఏ కమిషనర్‌తో కూడిన సమన్వయ కమిటీ ఈ సరఫరాను సమన్వయం చేస్తుంది’’ అంటూ మంత్రి ఏకనాథ్ షిండే ట్వీట్ చేశారు. అంబానీ సాయంపై పారిశ్రామిక‌వ‌ర్గాల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: