అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసింది. సింహాచలం వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మాన్సాస్  ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది. గతంలో మాన్సాస్ ట్రస్ట్, వ‌రాహ ల‌క్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును అధికారం మారిన త‌ర‌వాత తొలగించారు. ఆ స్థానంలో సంచయితను నియమిస్తూ ప్రభుత్వం 72 జీవోను విడుదల చేసింది.

కాగా తాజాగా సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసి పుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి అశోక్ గజపతి రాజు చైర్మన్ గా బాధ్యతలు స్వీక‌రించనున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వం ట్ర‌స్టు భూముల‌ను కాజేయ‌డానికే సంచ‌యిత‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌ని ప‌లుమార్లు అరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలింసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: