పోలీసులకు రేవంత్ వార్నింగ్ ?
గాయ‌ప‌డ్డ కార్య‌క‌ర్త కు కాంగ్రెస్ అండ‌గా ఉంటుంది.. ఇదీ రేవంత్ మాట.. ఇది వ‌ర‌కూ ఎన్న‌డూ లేనివిధంగా టీ పీసీసీ చీఫ్ ఇలా ఓ సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌కు ఇంకా చెప్పాలంటే విద్యార్థి సంఘం నేత‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం .. కాంగ్రెస్ లో వ‌చ్చిన మార్పు..అదేవిధంగా తెలంగాణ పోలీసు తీరుపై కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్న రేవంత్ వారిపై ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదుచేస్తామ‌ని చెబుతూనే,కేసీఆర్ ఇంటి మ‌నుషుల్లా పోలీసులు వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌ని వార్న్ చేస్తూ మాట్లాడారు. 
 
తెలంగాణ పోలీసుల‌కు రేవంత్ వార్నింగ్ ఇచ్చారా? లేదా తెలంగాణ పోలీసుల తీరుకు వీరంతా అస‌హ‌నం చెంది ఉన్నారా?  ఇవీ  ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో విన‌వ‌స్తున్న ప్ర‌శ్న‌లు. ఇవాళ తెలంగాణ పోలీసులు విచ‌క్ష‌ణ మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, అందుకు తానే ఓ ఉదాహ‌ర‌ణ అని ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల్మూరి వెంక‌ట్  రేవంత్ ద‌గ్గ‌ర వాపోయారు.. పోలీసుల అత్యుత్సాహం కార‌ణంగానే తాను తీవ్రంగా గాయ‌ప‌డ్డాన‌ని ఆయ‌న ఆవేద‌న చెందుతూ రేవంత్ ఎదుట కంట‌త‌డిపెట్టారు.. అస‌లు నిర‌స‌న కార్యక్ర‌మాలు ఏమ‌యినా స‌రే పోలీసుల జులం ఓ పెద్ద త‌ల‌నొప్పిలా మారుతుంద‌ని, వీళ్లంతా కేసీఆర్ కు అనుగుణంగా ప‌నిచేయ‌డం త‌ప్ప పౌరుల‌కు అండ‌గా ఉంటుందేమీ లేద‌ని ఆ కార్య‌క‌ర్త రేవంత్ వ‌ద్ద వాపోయాడు. ఇటీవ‌ల చ‌లో రాజ్ భ‌వ‌న్ పేరిట చేప‌ట్టిన నిర‌సన కార్య‌క్ర‌మంలో పోలీసుల అతి కారణంగా వెంక‌ట్ తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అత‌ని ప‌క్క‌టెముకలు విరిగేలా బాదారని
ఇదెంత మాత్రం త‌గ‌ద‌ని దీనిపై తాము మాన‌వ హ‌క్కుల సంఘానికి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామ‌ని, అలానే గాయ‌ప‌డిన వెంక‌ట్ కు అండ‌గా ఉంటామ‌ని రేవంత్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: