ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే రిజల్ట్స్ కు ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన స్లిప్ టెస్ట్ లు FA పరీక్షలకు వెయిటేని ఇచ్చి ఫైనల్ రిజల్ట్స్ ను ఇవ్వాలంటూ చాయారతన్ కమిటీ సిఫారసులు ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఇప్పటి వరకు FA పరీక్షల మార్కులు మరియు స్లిప్ టెస్టుల మార్కులను విద్యాశాఖ ఇంకా సిద్దం చేయనట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రిజల్ట్స్ విడుదల చేయడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. కరోనా కాలంలో విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలు చెప్పినప్పటికీ కేసులు పెరిగిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించేందుకు సాహసం చేయలేదు. దాంతో విద్యార్థులకు స్లిప్ టెస్ట్ లు మరియు FA పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: