ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ డీల‌ర్లు రాష్ట్ర బంద్ పాటించారు. రాష్ట్రవ్యాప్తంగా రేష‌న్ డీల‌ర్లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అధ్య‌క్షుడు మండాది వెంక‌ట్‌రావు మాట్లాడారు. జీవో నెంబ‌ర్ 10 ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.   వైఎస్ హ‌యాం నుంచే గ‌న్నీ సంచుల‌ను డీల‌ర్ల‌కు ఇచ్చార‌ని పేర్కొన్నారు.
 
అప్పటి నుండి కమీషన్ తో పాటు  గన్నీ బ్యాగ్ లు డీలర్లు అమ్ముకుంటారని వెల్ల‌డించారు. బ్యాగుల కొరత పేరుతో ప్రభుత్వమే తీసుకుని ఒక్కో సంచికి 20 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు అధికారులు గన్నీ బ్యాగ్ లకు డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. దీంతో డీల‌ర్లు ఆర్థికంగా మ‌రింత న‌ష్ట‌పోతార‌ని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే ఎలా నడపాలని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వేలకు వేలు జీతాలు తీసుకునే అధికారులు అన్యాయంగా నిర్ణయాలు చేస్తున్నారు. పది నుంచి పదిహేను వేల ఆదాయం లో సగం కోత వేస్తున్నారు. ఇలాగైతే మా కుటుంబాలను ఎలా  పోషించుకోవాలని పేర్కొన్నారు. ద‌శాబ్దాల నుంచి ఎండీఎం, ఐసీడీఎం బ‌కాయిలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని.. సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించి న్యాయం చేయాల‌ని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: