బ్యాంక్ లకు సెలవులంటే ఇప్పుడు అందరూ అలర్ట్ అవుతున్నారు . బ్యాంకింగ్ వినియోగం పెరిగిన నేపధ్యం లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారే కాకుండా , సాధారణ వినియోగదారులు కూడా   బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు . బ్యాంకింగ్ లావాదేవీలను పని రోజుల్లోనే పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .  ఈ క్రమంలోనే సెప్టెంబర్ లో  బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో వినియోగదారులు ముందుగానే తెలుసుకోవడం మంచిది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 14, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.


 ఇకపోతే సెప్టెంబర్‌ నెల‌లో వ‌చ్చే ఐదు ఆదివారాలు 1, 8, 15, 22, 29 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. వీటికి అదనంగా బ్యాంకు ఉద్యోగులకు మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. 2వ తేదీ సోమవారం వినాయక చవితి  సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అలాగే 10వ తేదీ మంగళవారం మొహరం పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఇవే సెలవులు వర్తిస్తాయి.ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి.


సెలవు దినాల్లో ఏటీఎం లలో నగదు నిల్వలు పెద్దగా అందుబాటు లో ఉండే అవకాశాలు తక్కువేనని చెప్పాలి . సెప్టెంబర్ మాసం లో బ్యాంకులు ఏకంగా తొమ్మిది దినాలు పని చేయకుండా ఉండడం వల్ల సాధారణ వినియోగదారులతో పాటు, వ్యాపార , వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు . అయితే బ్యాంకులకు ఇచ్చిన సెలవులను మార్చే అవకాశం లేకపోవడం తో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకుని , తమ కార్యకలాపాలను చక్కబెట్టుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు .


మరింత సమాచారం తెలుసుకోండి: